Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రిపోర్టర్ షేక్ జలీల్ తల్లి మృతికి సీనియర్ జర్నలిస్టు పరామర్శ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:22 AM

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ

22-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్వపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో జైభారత్ ఆధ్వర్యంలో ఈనెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న “జైభారత్ సామాజిక విప్లవ రణభేరి సభ”కు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సభ 24-02-2026న సూర్యాపేటలోని శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ (సద్దలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో) నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రణభేరి రాష్ట్ర కన్వీనర్ డా. ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ, “గాంధీ–అంబేద్కర్ల ఆశయాలు సాధిద్దాం… మనువాదాన్ని, మతోన్మాదాన్ని అంతం చేద్దాం” అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రణభేరి సభను విజయవంతం చేయడానికి పోరాట సంస్థల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.

కార్యక్రమంలో జైభారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ గల్లా, జైభారత్ బీసీ పోరాట వేదిక సూర్యాపేట జిల్లా కార్యదర్శి దడిపల్లి వెంకట్, జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, సామాజిక ఉద్యమకారులు నవిల ఉపేందర్, గుండగాని రేణుక, పల్లేటి రమేష్, జి. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.రణభేరి సభ ద్వారా సామాజిక న్యాయం, సమానత్వ సాధనపై విస్తృత చర్చ జరగనుందని నాయకులు తెలిపారు.

Sthanikam

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News