Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:12 AM

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు
11-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముగ్గుల పోటీలు.. గొబ్బెమ్మల ముచ్చట.. పతంగుల సందడి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో శుక్రవారం ఉత్సాహభరితమైన సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చైతన్యపురి డివిజన్ యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకలకు జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలోని ప్రతి ఇంటి ముందూ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల అలంకరణలు సంక్రాంతి వాతావరణాన్ని ఆవిష్కరించాయి. చిన్నారులు పతంగులు ఎగురవేస్తూ పండుగ సంబరాల్లో మునిగిపోయారు.

ఈ సందర్భంగా కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… రైతులు కష్టపడి పండించిన పంట ఇళ్లకు చేరే శుభసమయం సంక్రాంతి అని తెలిపారు. ధాన్యలక్ష్మికి స్వాగతం పలికేలా ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మలు తెలుగు సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి పూలతో గొబ్బెమ్మలను అలంకరించి పాటలు పాడటం సంక్రాంతి ప్రత్యేకతగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, శోభారాణి, ప్రసాద్, రంగేశ్వరి, నాగలక్ష్మి, జయశ్రీతో పాటు కాలనీ మహిళా నాయకులు అర్చన, కవిత, స్వాతి, అనురాధ, సయిదా, సనుత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News