Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:30 PM

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.

02-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికo ప్రతినిధి కొమిడాలమహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ తాము చదువుకున్న పాఠశాలను మండల విద్యాధికారి సైదా నాయక్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధిలో తమ వంతు సహకరిస్తామని తెలియజేశారు. గ్రామంలోని ఉన్న పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికైందని, వాటి ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలకు సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం సీలింగ్ తొందరలోనే రిపేర్లు చేయించి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని సర్పంచ్ గా అదే పాఠశాలకు వచ్చిన ఆవుల సుందర్ ను, ఉప సర్పంచ్ , బెల్లంకొండ లావణ్య రఘు ను ఎంఈఓ సైదా నాయక్ తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్ విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News