Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

బోరంచ గ్రామంలో పాపమ్మ గడ్డ కాలనీలో విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం

04-04-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ఇటీవల నెలలుగా “పాపమ్మ గడ్డ” పేరుతో ఏర్పడిన కొత్త కాలనీలో నివసిస్తున్న ప్రజలు, తమ ఇళ్ల మధ్యగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాద భయంతో జీవిస్తున్నారు. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, కాలనీవాసులు కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా సూచించారు. దీనితో ఈ రోజు గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప స్వయంగా పర్యవేక్షణలో 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలను ఎత్తుగా ఏర్పాటు చేసి వైర్లను సురక్షిత స్థాయికి పైకి ఎత్తే పనులు పూర్తి చేశారు. దీంతో కాలనీవాసులకు సమస్య నుండి ఉపశమనం లభించగా, ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కాలనీవాసులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Sthanikam

బోరంచ గ్రామంలో పాపమ్మ గడ్డ కాలనీలో విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ఇటీవల నెలలుగా “పాపమ్మ గడ్డ” పేరుతో ఏర్పడిన కొత్త కాలనీలో నివసిస్తున్న ప్రజలు, తమ ఇళ్ల మధ్యగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాద భయంతో జీవిస్తున్నారు. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, కాలనీవాసులు కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా సూచించారు. దీనితో ఈ రోజు గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప స్వయంగా పర్యవేక్షణలో 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలను ఎత్తుగా ఏర్పాటు చేసి వైర్లను సురక్షిత స్థాయికి పైకి ఎత్తే పనులు పూర్తి చేశారు. దీంతో కాలనీవాసులకు సమస్య నుండి ఉపశమనం లభించగా, ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కాలనీవాసులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News