Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం

23-05-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయంలో విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది. రెండో వారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ యువత, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావంతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం “జై శ్రీరామ్”, “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిపోయింది. యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హనుమంతుడి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొనాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News