Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:40 PM

బోగారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన యువ సర్పంచ్

26-01-2026 311 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం బోగారం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ, స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని ధ్యేయంగా పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పౌరులకు హక్కులు కల్పించారని గుర్తుచేశారు. భారతదేశ సార్వభౌమత్వం, స్వేచ్ఛను గౌరవిస్తూ నేటి బాలలను రేపటి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు సూచించారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్పంచ్ బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయుడు ముసుకు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటిమాన సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్ యాదవ్, చిరగోనో శిల్పా నవీన్ యాదవ్, వనం అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, దనమ్మ, భోగ సంధ్య, అంగన్వాడీ కార్యకర్త బత్తుల వసంత, ఆశా కార్యకర్త జెల్లా పారిజాత, ఉపాధ్యాయులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బోగారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన యువ సర్పంచ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News