Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:03 PM

బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక దృష్టి

బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక దృష్టి

బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక దృష్టి
17-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత పటిష్ట చర్యలు అవసరం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 204 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ సంవత్సరం 174 మంది మాత్రమే మరణించడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఏమిటి, ఇంకా ఏ చర్యలు అవసరమో వివరించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో కారణాలను లోతుగా విశ్లేషించి, ప్రాణ నష్టం జరగకుండా నివారణ చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు రోడ్డు భద్రతా సమావేశాల్లో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఏఎస్పీ రాహుల్ రెడ్డి జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై వివరాలు వెల్లడించారు.

సమీక్ష సమావేశంలో ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ అధికారి సాయి కృష్ణ, రోడ్లు భవనాల శాఖ అధికారి సరిత, ఆర్టీఏ నర్సింహా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక దృష్టి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News