Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:37 PM

బిఆర్ఎస్‌లో చేరికలతో కుదిపిన చిట్యాల రాజకీయం

27-01-2026 964 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ

నకిరేకల్‌లో యాభై కుటుంబాల బిఆర్ఎస్‌లో చేరిక

స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షబానా అజీముద్దీన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన యాభై కుటుంబాలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నేడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పట్టణ కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడ్డాయని ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

మార్పు పేరుతో ప్రజలను నమ్మించి ఓట్లు తీసుకుని, అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. కొత్త పథకాలు తీసుకురాకపోవడమే కాకుండా, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదల పొట్టకొడుతోందని విమర్శించారు. బాలింతలకు ఆసరాగా నిలిచిన కేసీఆర్ కిట్ పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం దారుణమని అన్నారు.

సన్నబియ్యం పథకం కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైందని, గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించిన చరిత్ర బిఆర్ఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. చదువుకున్న విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారని ఆరోపించారు. బతుకమ్మ పండుగకు కేసీఆర్ అందించిన చీరలను పేరుమార్చి పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

గ్రామాల్లో అభివృద్ధి లేదని, సంక్షేమం లేదని, ప్రజలకు భద్రత, రక్షణ కూడా లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నాయకులు ప్రజల గడప తడుతున్నారని, ఓట్లు, సీట్లు తప్ప పేద ప్రజల కష్టాలు వారికి పట్టవని వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని నకిరేకల్ పట్టణ ప్రజలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు.

Sthanikam

బిఆర్ఎస్‌లో చేరికలతో కుదిపిన చిట్యాల రాజకీయం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News