Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

భువనగిరిలో ‘పరీక్షా పే చర్చ 2026’ క్విజ్

23-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

భువనగిరి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ (PPC)–2026’ కార్యక్రమంలో భాగంగా క్విజ్ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.ముఖ్య అతిథిగా ప్రసిద్ధ విద్యావేత్త, ఐఏఎస్ ట్రైనర్ శ్రీ రవి కుమార్ ప్రజాపతి హాజరయ్యారు. చిన్న వయసులో ఐస్‌క్రీం విక్రేతగా జీవితం ప్రారంభించి, AP State Law CET–2003లో రెండో ర్యాంకు, నాలుగు సార్లు IAS ఇంటర్వ్యూలకు చేరిన ఆయన జీవన ప్రయాణం విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం శాంతా లక్ష్మి IAS అకాడమీ వ్యవస్థాపకుడు, PRISM360 NGO డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా రవి కుమార్ ప్రజాపతి వ్యాఖ్యానిస్తూ, “పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసమే జీవన దిశను నిర్ధారిస్తుంది. భయాన్ని దూరం పెట్టి లక్ష్యంపై దృష్టి పెట్టాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో సిబిసిఇ అఫిలియేటెడ్ పాఠశాలలు, పీఎం శ్రీ స్కూల్స్, కేజిబివి పాఠశాలలు, టిజిఎంస్ పాఠశాలల నుండి 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యస్థాయి మరియు సెకండరీ స్థాయిలకు అనుగుణంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి మాట్లాడుతూ, “పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచి, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది” అన్నారు.క్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్కార్ట్ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.మొత్తం‌గా ఈ PPC–2026 కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణ, పరీక్షల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో ఆదర్శవంతమైన కార్యక్రమంగా నిల

Sthanikam

భువనగిరిలో ‘పరీక్షా పే చర్చ 2026’ క్విజ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News