Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:48 AM

భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.వట్టె జానయ్య యాదవ్

23-02-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్‌ను కలిసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అనేక మంది ప్రజలు భూముల రికార్డుల లోపాలు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, సర్వే సమస్యలు, ఆక్రమణలు వంటి కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాధారణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే పట్టణంలోని ఇతర మౌలిక వసతుల సమస్యలపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండలం అధ్యక్షుడు బొల్లె సైదులు, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.వట్టె జానయ్య యాదవ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News