Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:00 PM

భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు భాషా నాయక్ తండలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం నుంచే తండ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ నిర్మాణానికి ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహాగ్రంథమని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కస్పరాజు రమేష్, భూక్య మహేష్, నిరుడు విజయకుమార్, బాలెమ్ ల ఉప్పలయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసిన సిందం సైదులుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో భాషా నాయక్ తండలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

Sthanikam

భాషా నాయక్ తండలో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News