Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:39 AM

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం

12-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేయాలి – స్వామీనాథన్ సిఫారసులు అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేలా ఉందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకుడు తిమ్మిడి హనుమంతరావు విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొని ఆయన మాట్లాడారు.అమెరికాలో పండించిన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, పాలు తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని సున్నాకు తగ్గించడం ద్వారా భారత రైతులను మార్కెట్ నుంచి తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. అక్కడి రైతులకు భారీ రాయితీలు ఇస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుండగా, మన దేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, స్వామీనాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం లేదని ఆరోపించారు.

దేశంలో దాదాపు ఇరవై కోట్ల రైతు కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, రోజుకు సగటున ముప్పై ఒకరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కొత్త ఉపాధి మార్పు చట్టాన్ని ఎత్తివేసి పాత చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దానికి కావలసిన వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు.విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దమ్మాయిగూడెం గ్రామంలో గంటపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో రేపాకుల శివలింగం, సోమనపల్లి వెంకటేశ్వర్లు, గొడుగు విజయ్, మీగడ సైదులు, శెట్టి నరసయ్య, పమ్మి జగదీష్, అంజి, ఈడబోయిన వెంకన్న, పేరం నాగయ్య, భాష, తిమ్మిడి రఘుబాబు, అంగిరేకుల వీరబాబు, సక్రం, సురేష్, నాగరాజ్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారత్–అమెరికా వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిద్దాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News