Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి

12-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన “భారత రాజ్యాంగ పరిరక్షణ – సవాళ్లు” సెమినార్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బలహీనపరచే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని అన్నారు. లౌకిక, సామ్యవాద భావజాలాన్ని ప్రస్తావించేందుకు ప్రభుత్వ పెద్దలు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లను క్రమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందని, విద్యా, వైద్య రంగాల్లో పేదలకు అవకాశాలు దూరమవుతున్నాయని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా మనువాద సిద్ధాంతాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడ్స్ అమలు ద్వారా కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె హక్కుపై ఆంక్షలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటలు పెరగడం, కనీస వేతనాలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా మారనున్నాయని హెచ్చరించారు.

వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో కూడా ప్రజలకు ప్రతికూల విధానాలు అమలవుతున్నాయని, ఉపాధి హామీ పథకాల భవిష్యత్తు అనిశ్చితంగా మారుతోందని తెలిపారు. ప్రజల హక్కులను కాపాడుకునేందుకు, మహనీయుల ఆశయ సాధన కోసం పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంధముల మాతయ్య, నాయకులు ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, ఇటికల బిక్షపతి, బాల నరసింహ, సల్ల రాజయ్య, బట్టు కొండయ్య, రాజలింగం, వరమ్మ, శాంతమ్మ, సత్యమ్మ, సుజాత, సునీత కుమారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News