Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

బేబీ మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలి

బేబీ మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలి

బేబీ మౌనిక మృతికి కారణమైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలి
February 24, 2026 06:52 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దళితులపై దాడులు ఆగాలన్న ఎమ్మెస్పీ జాతీయ నాయకుడు వంగూరి ఆనందరావు మాదిగ

నేలకొండపల్లి,: నాగర్ కర్నూలు జిల్లాలోని కొమ్మెర గ్రామ మల్లన్న జాతరలో చాకలి కులానికి చెందిన రెండు నెలలు నిండని బేబీ మౌనిక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిపై తక్షణమే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెస్పీ జాతీయ నాయకుడు వంగూరి ఆనందరావు మాదిగ డిమాండ్ చేశారు. బేబీ మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేలకొండపల్లి ప్రధాన కూడలి కేంద్రంలో బేబీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని నేలకొండపల్లి మండల ఎమ్మార్పీఎస్ కమిటీ, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వంగూరి ఆనందరావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, బలహీన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాకప్ మరణ ఘటన నుంచి ఇప్పటివరకు అనేక హత్యలు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అగ్రకుల అహంకారం కారణంగా దళితులపై అన్యాయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం స్పందించి మౌనిక మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా పోలీసు శాఖను ఆదేశించాలని డిమాండ్ చేశారు. కొమ్మెర గ్రామ మల్లన్న జాతరలో కుల వివక్షత కారణంగా పసిపాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. బాధ్యులను అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుడిపాటి ముక్కంటి మాదిగ, ఎమ్మెస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టపెంజర బాలస్వామి మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు తోళ్ల వెంకన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు తోళ్ల సురేష్ మాదిగ, మాజీ మండలాధ్యక్షుడు రాయబారపు గురవయ్య మాదిగ, బండి కరుణాకర్ మాదిగ, సూదుల ఉపేందర్ మాదిగ, తోళ్ల జానకి మాదిగ, తోళ్ల బాబు మాదిగ, తోళ్ల ప్రకాశం మాదిగ, బీసీ నాయకులు కృష్ణమూర్తి, కృష్ణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News