Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:25 PM

బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి బైక్ ర్యాలీ

27-01-2026 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ నగర ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అధిక పనిభారం, ఒత్తిడితో పనిచేస్తున్నారని, కుటుంబ జీవనానికి, ఆరోగ్యానికి ఐదు రోజుల పని విధానం అవసరమని తెలిపారు. ఇతర రంగాల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలులో ఉండగా, బ్యాంకింగ్ రంగంలోనూ అదే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ర్యాలీ అనంతరం ఉద్యోగులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను నినాదాల రూపంలో వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Sthanikam

బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినం కల్పించాలి బైక్ ర్యాలీ

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

వారానికి ఐదు రోజుల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ నగర ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అధిక పనిభారం, ఒత్తిడితో పనిచేస్తున్నారని, కుటుంబ జీవనానికి, ఆరోగ్యానికి ఐదు రోజుల పని విధానం అవసరమని తెలిపారు. ఇతర రంగాల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమలులో ఉండగా, బ్యాంకింగ్ రంగంలోనూ అదే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ర్యాలీ అనంతరం ఉద్యోగులు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను నినాదాల రూపంలో వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News