Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:50 PM

బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన వీరుడు సుభాష్ చంద్రబోస్

23-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరాక్రమ దివస్ సందర్భంగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేతాజీ జయంతి ఘనోత్సవం

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్నిపథం ఎంచుకున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా జీవితాన్నే త్యాగం చేసిన అపూర్వ దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు రెండుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ, అనంతరం ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధప్రకటన చేసిన ధైర్యశాలి నేతాజీ అని కొనియాడారు.

చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తన ఐసిఎస్ పదవిని త్యజించి, ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించడం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్య పునాదులకే సవాల్ విసిరిన మహనీయుడని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్‌ను కలుసుకుని భారత విముక్తికి మద్దతు కోరిన ఏకైక భారతీయుడు నేతాజీ అని పేర్కొన్నారు. సిద్ధాంత పరంగా గాంధీజీతో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియో ప్రసంగంలో మహాత్మా గాంధీని తొలిసారిగా ‘జాతిపిత’గా సంబోధించిన విశాల హృదయుడని వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, టి. శ్రీనివాస్, అమరేందర్, నరేష్, ఆంజనేయులు, రవి, రాధికలతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన వీరుడు సుభాష్ చంద్రబోస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News