Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

బాలికల హైస్కూల్‌కు సొంత ఖర్చులతో సున్నం, దీపాల ఏర్పాటు.ఉపసర్పంచ్,8 వ వార్డు సభ్యులు

25-01-2026 477 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాలికల చదువుకు వెలుగు పంచిన సేవా హస్తం

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట పట్టణంలోని బాలికల హైస్కూల్ గత కొన్నేళ్లుగా సున్నం వేయకపోవడంతో శిదిలావస్థలో దర్శనమిచ్చింది. పాఠశాల భవనం పరిస్థితిని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, మాటలకే పరిమితం కాకుండా పనితో స్పందించారు.పాఠశాల సందర్శన సమయంలో హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు సున్నం వేయించాలని కోరగా, పట్టణ ఉపసర్పంచ్ మోటే రమేష్, ఎనిమిదవ వార్డు సభ్యులు అబ్దుల్ వహిద్ మహమ్మద్ (అంజాద్) తమ సొంత ఖర్చులతో పాఠశాల భవనానికి సున్నం వేయించారు. దీంతో పాఠశాల రూపురేఖలు మారి, విద్యార్థినులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.

అదేవిధంగా పదవ తరగతి విద్యార్థినులు రాత్రి తరగతులకు వచ్చే సమయంలో చీకటిలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియజేయగానే, పాఠశాల పరిసరాల్లో దీపాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టారు. దీపాల వెలుగుతో విద్యార్థినులకు భద్రత, సౌకర్యం మరింత మెరుగుపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.

ప్రజాప్రతినిధుల ఈ సేవాభావానికి పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన ఈ చర్య ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

బాలికల హైస్కూల్‌కు సొంత ఖర్చులతో సున్నం, దీపాల ఏర్పాటు.ఉపసర్పంచ్,8 వ వార్డు సభ్యులు

Article Image

బాలికల చదువుకు వెలుగు పంచిన సేవా హస్తం

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట పట్టణంలోని బాలికల హైస్కూల్ గత కొన్నేళ్లుగా సున్నం వేయకపోవడంతో శిదిలావస్థలో దర్శనమిచ్చింది. పాఠశాల భవనం పరిస్థితిని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, మాటలకే పరిమితం కాకుండా పనితో స్పందించారు.పాఠశాల సందర్శన సమయంలో హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు సున్నం వేయించాలని కోరగా, పట్టణ ఉపసర్పంచ్ మోటే రమేష్, ఎనిమిదవ వార్డు సభ్యులు అబ్దుల్ వహిద్ మహమ్మద్ (అంజాద్) తమ సొంత ఖర్చులతో పాఠశాల భవనానికి సున్నం వేయించారు. దీంతో పాఠశాల రూపురేఖలు మారి, విద్యార్థినులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.

అదేవిధంగా పదవ తరగతి విద్యార్థినులు రాత్రి తరగతులకు వచ్చే సమయంలో చీకటిలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియజేయగానే, పాఠశాల పరిసరాల్లో దీపాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టారు. దీపాల వెలుగుతో విద్యార్థినులకు భద్రత, సౌకర్యం మరింత మెరుగుపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.

ప్రజాప్రతినిధుల ఈ సేవాభావానికి పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన ఈ చర్య ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News