Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

బాలికల భద్రతే సమాజానికి దిశ జాతీయ బాలిక దినోత్సవంలో సంకల్ప నినాదం

24-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాయగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి

బాలికల రక్షణ, హక్కులు, విద్య పట్ల సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు పిలుపునిచ్చారు. మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ బాల బాలికలకు చట్టపరమైన హక్కులు, రక్షణ విధానాలు, విద్య ప్రాముఖ్యతను వివరించారు. మంచి స్పర్శ–చెడుస్పర్శపై అవగాహన కలిగి ఉండాలని, బాలికలను పుట్టనిద్దాం, కాపాడిద్దాం, చదివిద్దాం, ఎదిగేలా చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేసి బాలికల చదువుకు ప్రోత్సాహం అందించారు. బాలికలు భయం లేకుండా ఎదిగే వాతావరణం ఏర్పడితేనే సమాజం బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి శైలజ, బాలికా రక్షణ సమన్వయకర్త అనంతలక్ష్మీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అండాలు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సాధికారత బృంద సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బాలికల భద్రతే సమాజానికి దిశ జాతీయ బాలిక దినోత్సవంలో సంకల్ప నినాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News