Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:29 PM

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

24-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జనవరి 24:

బాలికల హక్కుల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది అన్న సందేశంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ బాలిక దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం జరిగింది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. నాగేంద్రమ్మ, సరిత బాలికలకు చట్టపరమైన హక్కులు, సంరక్షణ, బాల్య వివాహ నిషేధం, విద్య హక్కుల ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలపై స్పష్టంగా వివరించారు. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని హెచ్చరించారు.వసతి గృహ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ విద్యార్థినీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి చదువు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ధైర్యంగా ముందుకు సాగితేనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థినీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బాలిక హక్కులే భవిష్యత్తుకు భరోసా జాతీయ బాలిక దినోత్సవంలో చట్టపరమైన అవగాహన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News