Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:53 PM

బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

21-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యజమానులు, మేస్త్రీలు, పరిశ్రమల పర్యవేక్షకులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు స్పష్టం చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ మీటింగ్ హాల్‌లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ‘ఆపరేషన్ స్మైల్’పై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌తో పాటు అడిషనల్ డీసీపీ లక్ష్మీ నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 0 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను ఎక్కడైనా పనుల్లో పెట్టినా, వెట్టి చాకిరీ చేయించినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 97 మంది బాలకార్మికులను రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు.‘ఆపరేషన్ స్మైల్’, ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వృత్తిపరమైన బాధ్యతగా అధికారులు శ్రద్ధతో పనిచేసి పిల్లల భవిష్యత్తుకు వెలుగు నింపాలని అన్నారు.బాలల సంరక్షణకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని, ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ కోసం ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకున్నట్లయితే FIR నమోదు చేసి, యజమాని A1గా, మేస్త్రీ A2గా, సంబంధిత పరిశ్రమల సూపర్వైజర్‌లను A3గా చేర్చి కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో CWC, JJB సిబ్బంది, BRB కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా డీఎంహెచ్‌వో మనోహర్, AD ప్రశాంత్ రెడ్డి, పోలీస్ శాఖ సిబ్బంది, ఎన్‌జీవో ప్రతినిధులు, చైల్డ్ హెల్ప్‌లైన్, CCI సిబ్బంది, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News