Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:18 AM

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

11-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఐ శతాబ్ది సభకు పిలుపు: ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ

రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, గత వందేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసిన ఘన చరిత్ర సిపిఐకే దక్కుతుందని అన్నారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం జరిగిన ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, భూమిలేని నిరుపేదలకు భూములు పంచిన ఘనత పార్టీదేనని పేర్కొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ శతజయంతి ముగింపు ఉత్సవాలుగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, గంగాపురం యాదయ్య, వీరమల్ల ముత్తయ్య, సంగిశెట్టి పాండు, ఊట్కూరి కృష్ణ, ఎర్ర బిక్షపతి, ఏనూతుల రమేష్, వీసం గాలయ్య, సిహెచ్ మల్లయ్య, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News