Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు

13-04-2026 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వేములకొండలో క్షేత్ర ప్రదర్శన.. హర్షం వ్యక్తం చేసిన రైతులు

రైతులు ఆధునిక వరి వంగడాలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆదిత్య సీడ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో రైతు మిత్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో అదిత్య వారి AK -56 వరి రకంపై క్షేత్ర స్థాయి రైతు సమావేశం నిర్వహించారు. స్థానిక రైతు కందాటి మల్లారెడ్డి పొలంలో సాగు చేసిన ఈ పంటను సుమారు 100 మందికి పైగా రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నాణ్యమైన దిగుబడి.. రైతు సంతోషం

ఈ సందర్భంగా క్షేత్ర యజమాని మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది సాగు చేసిన AK -56 వరి రకం అద్భుతమైన దిగుబడిని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. గింజ గట్టిగా ఉండటంతో పాటు, చీడపీడలను తట్టుకునే శక్తి ఈ రకానికి ఉందని, తోటి రైతులు కూడా ఈ వంగడాన్ని ఎంచుకోవడం లాభదాయకమని సూచించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ రీజినల్ మేనేజర్ మట్టపల్లి, రైతు మిత్ర ట్రేడర్స్ అధినేత ఆకుల వెంకన్న, సేల్స్ ఆఫీసర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ​AK-56 వంగడం నాణ్యతలో మేలైనదని వివరించారు. ​తక్కువ నీటి వినియోగంతో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలకడైన దిగుబడిని ఇస్తుందని తెలిపారు.రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తామని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు పాల్గొని పంట పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Sthanikam

అత్యధిక దిగుబడినిచ్చే 'AK-56' వరి రకంతో లాభాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News