Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:28 AM

ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు

19-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా హెచ్‌పీవీ ఆరోగ్య అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యత, ఆరోగ్య పరీక్షల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను వారు స్వయంగా పరిశీలించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మహిళలు సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం మరియు సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఇటువంటి అవగాహన శిబిరాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.శిబిరంలో వైద్యులు గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, నివారణ మార్గాలు, హెచ్‌పీవీ టీకా ప్రయోజనాలపై మహిళలకు వివరించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News