Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి

09-03-2026 213 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే మార్నింగ్ వాకింగ్‌ను తప్పనిసరి అలవాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం పట్టణ కేంద్రంలోని హైస్కూల్ సమీపంలోని వనిపాకల రోడ్డుపై నిర్వహించిన 1కే రన్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ, కంప్యూటర్ యుగంలో జీవనశైలి మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే కొంతసేపు మార్నింగ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం… మార్నింగ్ వాకింగ్ అలవాటు చేసుకోండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News