Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:53 AM

అర్ధశతాబ్దం తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు.

25-01-2026 723 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గురువులు నేర్పిన విద్య, విలువలను జీవితంలో అమలు చేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందని రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. చదువుకున్న పూర్వ విద్యార్థులు వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం కాకుండా సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1974 నుంచి 1976 మధ్య కాలంలో ఆరవ, ఏడవ తరగతులు చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక జీఆర్‌ఎం ఫంక్షన్‌ హాల్‌లో స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.యాభై ఏళ్ల క్రితం ఒకే గదిలో చదువుకున్న సుమారు అరవై మంది విద్యార్థులు మళ్లీ ఒకే వేదికపై కలవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆనాటి ఉపాధ్యాయులు రామిని కైలాసం, గోదాసు అంజయ్యలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అదే విధంగా రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డిలకు సత్కారం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ బాల్యాన్ని తలుచుకుంటూ పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు, ఆటలు, క్రమశిక్షణతో కూడిన బోధనను గుర్తు చేసుకున్నారు. ఆ విద్యే తమ జీవితాలకు పునాదిగా మారిందని పేర్కొన్నారు.అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. అర్ధశతాబ్దం తర్వాత తమ విద్యార్థుల నుంచి లభించిన ఈ గౌరవం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని అన్నారు. ఎనభై ఏళ్లు దాటినా విద్యార్థులు చూపిన ఆప్యాయత తమ మనసులను తాకిందని తెలిపారు.కొమ్మాయిగూడెం సర్పంచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. గురువులు నేర్పిన విద్య వల్లే తాను ప్రజాసేవ వైపు అడుగులు వేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యానని చెప్పారు.పూర్వ విద్యార్థి గోదాసు గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి గోదాసు మల్లేశం, మోటారు వాహనాల పరిశీలకుడు గోదాసు రవి, విశ్రాంత ఈఈ సురేందర్‌తో పాటు అయూబ్, బట్టే లక్ష్మణ్, ఏ.భద్రయ్య, జయసింహా రెడ్డి, డీఈ బండ వెంకటేశ్వర్ రెడ్డి, బుట్టే విశ్వనాథం, రామన్, కొమ్ము బిక్షపతి, వై.డి. మజర్, కాలేరు ఫన్నయ్య, ఏ.రమేష్, లోపాము చంద్రశేఖర్, మురళీధర్, భగవంతుం, రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్ధశతాబ్దం తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News