Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

అర్ధరాత్రి ‘కామన్ మహిళ’గా కమిషనర్… ఆకతాయిలకు గట్టి షాక్!

06-05-2026 152 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

40 మంది ఆకతాయిల బండారం బట్టబయలు!

దిల్‌సుఖ్‌నగర్లో ఆకతాయిల అరాచకం వెలుగులోకి!

దిల్‌సుఖ్‌నగర్/చైతన్యపురి, : ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వినూత్నంగా ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి యూనిఫాం లేకుండా సాధారణ మహిళలా మారి దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ పరిసరాల్లో పర్యవేక్షణ నిర్వహించారు.

రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒంటరిగా రోడ్డుపై నిలబడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సమయంలో పలువురు యువకులు ఆమెను చేరుకుని అసభ్య వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనతో ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు కూడా వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు.

దాదాపు 40 మంది ఆకతాయిలు ఆమె చుట్టూ చేరినప్పటికీ, కమిషనర్ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటూ వారిని గమనించారు. ఈ వ్యవధిలో పెట్రోలింగ్ సిబ్బంది స్పందన ఆలస్యంగా రావడం గమనార్హం. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు, ఈ ప్రాంతంలో హాస్టళ్లు అధికంగా ఉండటం వల్ల యువకుల అల్లర్లు పెరుగుతున్నట్లు గుర్తించారు

Sthanikam

అర్ధరాత్రి ‘కామన్ మహిళ’గా కమిషనర్… ఆకతాయిలకు గట్టి షాక్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News