Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి

23-01-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాలల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్

స్థానికం ప్రధాన ప్రతినిధి

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారుల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ కోరారు. మూడు సంవత్సరాల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయిన యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జ సంకీర్తన, గుజ్జ వర్షిణిల భవిష్యత్తు అంధకారంలో పడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన చిన్నారులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకొని, వేదిక తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే అమ్మా–నాన్నలను కోల్పోయిన ఈ పిల్లలకు బాధ్యత తీసుకునే సమీప బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసి తల్లి గుజ్జ రాధ (40) అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు.

గుజ్జ రాజు పుట్టుకతోనే అంధుడని, సుమారు పదహారు సంవత్సరాల క్రితం రాధను వివాహం చేసుకున్నాడని చెప్పారు. వారికి సంకీర్తన (12), వర్షిణి (10) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వివరించారు. రాజు తల్లి గుజ్జ వజ్రమ్మ పద్నాలుగు సంవత్సరాల క్రితమే మృతి చెందగా, రాజు తరపు బంధువులు ఎవరూ లేని పరిస్థితి ఉందన్నారు.ప్రస్తుతం రాధ తల్లి విశాలాక్షి చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నా, ఆమె వయోవృద్ధురాలు కావడంతో దీర్ఘకాలంగా పిల్లలను పోషించడం సాధ్యం కాదని వెంకటేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారుల పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకొని, వారు మైనారిటీ వయసు చేరే వరకు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

అమ్మా–నాన్నను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే అండగా నిలవాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News