Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

అక్రమాల ఆరోపణలపై వీఓఏ తొలగింపుకు డిమాండ్ మహిళా సంఘాల ఫిర్యాదు.. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం

24-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చింతపల్లి,

పి.కె. మల్లెపల్లి గ్రామంలో వీఓఏగా పనిచేసిన గనిపల్లి మాధవిపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మహిళా సంఘ బంధం అధ్యక్షురాలు బాడిగ అలివేలు, ఉపాధ్యక్షురాలు పోలె జంగమ్మ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించిన గ్రామసభలో వీఓఏ గనిపల్లి మాధవిపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యాయని తెలిపారు. మహిళా సంఘ సభ్యులు, లీడర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను వెంటనే రికవరీ చేసి, ఆమెను విధుల నుంచి తొలగించాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆమె స్థానంలో కొత్త వీఓఏను నియమించాలని డిమాండ్ చేశారు.

గ్రామస్తుడు కోట్ల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామసభ తీర్మానం జరిగినప్పటికీ కొంతమంది అధికారులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన డీఆర్‌డీఏ పీడీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీల తీర్మానం ఆధారంగా విచారణ చేపట్టి, అక్రమాలు రుజువైతే వీఓఏను విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ వసూళ్లను రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొప్పోలు అమర్నాథ్ గౌడ్, దార్ల రాజు శ్యాంసుందర్, పూల నరేష్, వెంకటయ్య, గనిపల్లి వెంకటేష్, దార్ల శేఖర్, ముచ్చర్ల నరేష్, దార్ల ప్రభాకర్, జేల్లా అరవింద్, పబ్బు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అక్రమాల ఆరోపణలపై వీఓఏ తొలగింపుకు డిమాండ్ మహిళా సంఘాల ఫిర్యాదు.. డీఆర్‌డీఏ పీడీకి వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News