Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

07-03-2026 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని ఐరా గ్లోబల్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళల గౌరవం, సమాన హక్కులు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, అధ్యాపకులు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

చౌటుప్పల్ పట్టణంలోని ఐరా గ్లోబల్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళల గౌరవం, సమాన హక్కులు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, అధ్యాపకులు , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News