Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:26 AM

ఐదు నిమిషాల్లో ‘నో స్టాక్’... వెలిమినేడు పిఎసిఎస్ వద్ద రైతుల ఆగ్రహం

21-02-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎరువుల కొరతతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతులకు యూరియా సరఫరాలో జరిగిన గందరగోళం మరింత ఆగ్రహాన్ని రగిలించింది.స్థానిక పిఎసిఎస్ సెంటర్‌కు 550 యూరియా బస్తాలు చేరినట్టు సమాచారం అందడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయం నుంచే కేంద్రం వద్దకు తరలివచ్చారు. అయితే యూరియాను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన కేవలం ఐదు నిమిషాలకే ‘నో స్టాక్’గా చూపించడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. స్టాక్ వచ్చి వెంటనే ముగిసిపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు.

“మాకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం తెలియదు. వ్యవస్థను సులభంగా అర్థం చేసుకునేలా చేయకుండా, రైతులను దూరం పెట్టే విధంగా మారింది” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు పిఎసిఎస్ గేట్‌కు తాళం వేసి నిరసనకు దిగారు. ఆన్‌లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, స్థానిక రైతులకు ప్రత్యక్షంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆరోపణల ప్రకారం, పిఎసిఎస్ పరిధిలోని రైతులకు కాకుండా ఇతర ప్రాంతాల వారు ముందుగానే బుక్ చేసుకుని యూరియాను పొందుతున్నారని అంటున్నారు. దీంతో సీజన్ కీలక దశలో ఉన్న పంటలకు ఎరువులు అందక స్థానిక రైతులు నష్టపోతున్నారని వాపోయారు.

విషయం తెలిసి సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపినట్లు సమాచారం. సరఫరా విధానంపై స్పష్టత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు హెచ్చరించారు. సాగు వేళలో ఎరువుల లభ్యత కీలకమని, సరఫరాలో పారదర్శకత లేకపోతే రైతాంగంతీవ్రఇబ్బందులుఎదుర్కొంటుందనినిపుణులుఅభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

Sthanikam

ఐదు నిమిషాల్లో ‘నో స్టాక్’... వెలిమినేడు పిఎసిఎస్ వద్ద రైతుల ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News