Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:54 PM

ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి. 25న హైదరాబాద్ బహిరంగ సభకు మహిళలు భారీగా తరలిరావాలి

22-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జంపాల అండాలు పిలుపు

స్థానికం ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్‌లో ఈ నెల 25న నిర్వహించనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభల సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జంపాల అండాలు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన మహిళలు కదిలి వచ్చి ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.మునిపంపుల గ్రామంలో ఐద్వా గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా రంగురంగుల బెలూన్లు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జంపాల అండాలు మాట్లాడుతూ, దేశంలోనే బలమైన మహిళా హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఐద్వా 5వ జాతీయ మహాసభలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు.జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై విస్తృత చర్చ జరగడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు, అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, స్త్రీని వ్యాపార వస్తువుగా మార్చి పెట్టుబడి వర్గాలు లాభాలు గడిస్తున్నాయని విమర్శించారు.“అవనిలో సగం–అన్నింటిలో సగం” అనే నినాదాలు ప్రచారాలకు మాత్రమే పరిమితమైపోయాయని, మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు అవసరమైన చొరవ చూపడం లేదన్నారు. మహిళా హక్కుల రక్షణ కోసం ఐద్వా చేపడుతున్న పోరాటాల్లో మహిళలు భాగస్వాములు కావాలని, ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా శాఖ కార్యదర్శి జోగుల ధనలక్ష్మి, ఐద్వా గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు యాదాసు శారద, తాళ్లపల్లి హేమలత, గ్రామ నాయకులు నోముల మంగమ్మ, మౌనిక, బొడ్డుపల్లి సంధ్య, ఆకుల ముత్తమ్మ, జంపాల పద్మమ్మ, పులిపలుపుల జయమ్మ, కూనూరు అంజమ్మ, బోనగిరి మౌనిక, గంప పద్మ, గంప యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి. 25న హైదరాబాద్ బహిరంగ సభకు మహిళలు భారీగా తరలిరావాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News