త్రిశూల స్నానంతో ముగిసిన కాకతీయ కాలంనాటి శివాలయ ఉత్సవాలు
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలంనాటి శివాలయాలలో మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా తెల్లవారుజామున అగ్గిగుండాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. స్వామివారి ఆశీస్సులతో భక్తులు అగ్గిగుండాలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.జాతర చివరి ఘట్టంగా సాయంత్రం త్రిశూల స్నానం నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ అంటూ స్వామివారిని స్మరిస్తూ భక్తి భావంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు హరి పంతులు, ఆలయ అర్చకులు సంతోష్ శర్మ,12వ వార్డ్ కౌన్సిలర్ కోడి నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి