Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:38 PM

అధికారం కోసం కాదు.. సిద్ధాంతం కోసం పోరాడిన కార్యకర్తను 12వ వార్డు నుంచి ముందుకు తేవాలి : చెరుకు లింగస్వామి గౌడ్

27-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, పార్టీ సిద్ధాంతాలే మార్గదర్శకంగా అహర్నిశలు నిబద్ధతతో పనిచేశానని కాంగ్రెస్ పార్టీ మాజీ చౌటుప్పల్ పట్టణ అధ్యక్షుడు చెరుకు లింగస్వామి గౌడ్ స్పష్టం చేశారు.మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తనకు ఊహ వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఏర్పడిందన్నారు. తన తండ్రి చెరుకు యాదయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా కొనసాగుతూ, చిన్ననాటి నుంచే తనలో పార్టీపై ప్రేమ, ప్రజాసేవపై చైతన్యం నాటారని గుర్తు చేశారు.2007 నుంచి 2009 వరకు యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, 2009 నుంచి 2014 వరకు యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా, 2014 నుంచి నేటి వరకు రాజీవ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో ముందుండి పనిచేశానన్నారు. అప్పటి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అభిమానిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు.ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్నానని తెలిపారు.

తన వార్డు నుంచి గతంలో రిజర్వేషన్ కారణంగా అవకాశం రాలేదని, ప్రస్తుతం బీసీ జనరల్ కావడంతో ఈసారి 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో పార్టీ తరఫున అవకాశం కల్పించాలని కోరారు.రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తకు న్యాయం చేస్తూ అవకాశం ఇస్తే, ప్రజలకు మరింత అంకితభావంతో సేవ చేయగలనని లింగస్వామి గౌడ్ తెలిపారు.

Sthanikam

అధికారం కోసం కాదు.. సిద్ధాంతం కోసం పోరాడిన కార్యకర్తను 12వ వార్డు నుంచి ముందుకు తేవాలి : చెరుకు లింగస్వామి గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News