Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 02:21 AM

అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!

08-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో రోడ్ రోలర్‌తో 72 సైలెన్సర్ల ధ్వంసం..

నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు..

లైసెన్సులు రద్దు చేస్తామని అదనపు ఎస్పీ రమేష్ హెచ్చరిక..

నల్లగొండ : రహదారులపై వెళ్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దకాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై నల్లగొండ జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 72 మాడిఫైడ్ సైలెన్సర్లను బుధవారం పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద రోడ్ రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.​

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను కాదని అధిక శబ్దం వచ్చేలా మార్పులు చేసిన వాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను తొలగించారు. అదనపు ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో వీటిని బహిరంగంగా ధ్వంసం చేయడం ద్వారా వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. యువత మోజుతో సైలెన్సర్లను మార్చి సామాన్య ప్రజలను, ముఖ్యంగా వృద్ధులు, రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ఇకపై మాడిఫైడ్ సైలెన్సర్లతో దొరికితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, పదేపదే నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఎవరైనా అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవ రావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు సైదులు, సైదా బాబు, రాజీవ్ రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News