Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 04:29 AM

చిన్నారికి భరోసా తండ్రికి ఉపాధి.!

చిన్నారికి భరోసా తండ్రికి ఉపాధి.!

చిన్నారికి భరోసా తండ్రికి ఉపాధి.!
08-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మానవత్వం..

 ప్రమాదంలో కాలు కోల్పోయిన బాలికకు కృత్రిమ పాదం..

జీవనోపాధికి మూడు చక్రాల బండి మంజూరు..

నల్గొండ : కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విధి వంచించిన ఓ చిన్నారి భవిష్యత్తుకు భరోసానిస్తూ ఆమె తండ్రికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు తక్షణమే స్పందించారు. కనగల్ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుమార్తె స్వాతిక (10) కొన్నాళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో దురదృష్టవశాత్తూ తన కాలును కోల్పోయింది. అప్పటి నుంచి ఆ చిన్నారి పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన తండ్రి, బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తన కుమార్తెకు కృత్రిమ కాలు అమర్చాలని, అలాగే కుటుంబ పోషణ నిమిత్తం తనకు ఒక మూడు చక్రాల బండిని మంజూరు చేయాలని విన్నవించారు. బాధిత తండ్రి వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

చిన్నారి స్వాతికకు అవసరమైన కృత్రిమ పాదాన్ని (Artificial Leg) వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ బాలిక తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రమౌళి ఉపాధి కోసం మూడు చక్రాల బండిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదలకు నిస్సహాయులకు అండగా ఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగులకు చేయూతనివ్వడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. స్వాతిక భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.​కలెక్టర్ చూపిన చొరవ పట్ల స్వాతిక కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించి తక్షణమే స్పందించిన కలెక్టర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చిన్నారికి భరోసా తండ్రికి ఉపాధి.!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News