Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:38 AM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కొత్త దిశకు నాంది వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులు త్వరలో : వీసీ ఘంటా చక్రపాణి

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కొత్త దిశకు నాంది వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులు త్వరలో : వీసీ ఘంటా చక్రపాణి

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కొత్త దిశకు నాంది వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులు త్వరలో : వీసీ ఘంటా చక్రపాణి
January 26, 2026 12:52 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన సమానత్వ సమాజాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ముందడుగు వేస్తోందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులను ప్రారంభించనున్నట్లు వీసీ ప్రకటించారు. గ్రామీణ తెలంగాణ విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా ఈ కోర్సులను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు ఉపాధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు.

విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. దేశ విదేశాల్లోని సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా పాఠ్యాంశాలను రూపొందించినట్లు వెల్లడించారు.అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ యల్. విజయ కృష్ణ రెడ్డి నాన్-టీచింగ్ ఉద్యోగ సంఘ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, ప్రొఫెసర్ ఆనంద్ పవార్, ప్రొఫెసర్ రబింద్రనాథ్ సోలమన్, ప్రొఫెసర్ పల్లవి కాబడే, డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ శ్రీదేవి, ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్‌తో పాటు డైరెక్టర్లు, డీన్లు, బోధన-బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News