Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశ్రాంత అధ్యాపకులే బలస్తంభం

24-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుభవాన్ని వదులుకోం : ఉపకులపతి ఘంటా చక్రపాణి

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి విశ్రాంత అధ్యాపకుల అనుభవమే కీలకమని, వారి సూచనలు–సలహాలు యూనివర్సిటీ ప్రగతికి దారిచూపుతాయని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.

శనివారం యూనివర్సిటీలో నిర్వహించిన విశ్రాంత అధ్యాపకుల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

యూనివర్సిటీ విద్య, పరిశోధన, పాలన రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని, ఈ సమయంలో గతంలో బోధనతో పాటు పాలనా బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత అధ్యాపకుల సలహాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

విశ్రాంత అధ్యాపకుల కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉపకులపతి వెల్లడించారు. పరిశోధన చేస్తున్న విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం, యూనివర్సిటీ విధానాలపై సలహాలు ఇవ్వడం ద్వారా విశ్రాంత అధ్యాపకులు మళ్లీ చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకుల సంక్షేమ సంఘం ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని ఘనంగా సన్మానించింది.

ఈ సమావేశంలో మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్, సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.వి. రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ సి. వెంకటయ్య, మాజీ రెక్టర్ ప్రొఫెసర్ కుప్పుస్వామి రావు, మాజీ రిజిస్ట్రార్లు డా. జి. లక్ష్మారెడ్డి, డా. పి. కృష్ణారావు, మాజీ డైరెక్టర్లు ప్రొఫెసర్ రామయ్య, డా. పి. విజయలక్ష్మి పండిట్, డా. బనోత్ లాల్, ప్రొఫెసర్ ఎం.ఎస్. హయత్, ప్రొఫెసర్ సరస్వతీరావు, మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశ్రాంత అధ్యాపకులే బలస్తంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News