Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:17 AM

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం

ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ – 18 మందికి రూ.7.62 లక్షల సాయం
January 28, 2026 08:07 PM 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలోని ఉమాపతి నాయుడు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గానికి చెందిన మొత్తం పద్దెనిమిది మంది లబ్ధిదారులకు రూ.7 లక్షల 62 వేల 897 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిందని తెలిపారు.

ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు తదితర సందర్భాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఈ సహాయమే నిదర్శనమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News