Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:04 PM

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం
16-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

24న సంపూర్ణ బంద్, 18న బైక్ ర్యాలీ : జేఏసీ

ఆదోని, స్థానిక ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ చేపడుతున్న ఉద్యమ కార్యచరణను జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం ఆదోని భీమాస్ హోటల్‌లోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రఘురామయ్య మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి ఆదోని జిల్లా అంశంపై చర్చించామని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మూడుసార్లు చర్చించినట్లు మంత్రి వెల్లడించారని చెప్పారు. సంక్రాంతి అనంతరం మంత్రులందరూ కలిసి ముఖ్యమంత్రితో చర్చించి స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

కర్నూలులో మంత్రి టీజీ భరత్‌ను కలిసి వినతిపత్రం అందజేసి ఆదోని జిల్లా కోసం మద్దతు కోరగా, చివరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదోని జిల్లా అంశాన్ని బర్నింగ్ ఇష్యూ అని పేర్కొంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు.

ఆదోని జిల్లా ఉద్యమానికి సీపీఐ కర్నూలు జిల్లా కార్యవర్గం సంపూర్ణ మద్దతు తెలపడం ఉద్యమానికి బలాన్ని చేకూర్చిందని జేఏసీ నాయకులు తెలిపారు.జేఏసీ నాయకులు అశోకానంద రెడ్డి మాట్లాడుతూ.. ఆదోని జిల్లా ఏర్పాటు కోసం జనవరి 24న ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో సంపూర్ణ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 18న ఆదోని పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీరేష్, సుజ్ఞానమ్మ, కమతం వెంకటేష్, దస్తగిరి నాయుడు, కుంకునూరు వీరేష్, ప్రకాష్, అయ్యాళప్ప, కృష్ణమూర్తి గౌడ్, నరేంద్ర యాదవ్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News