Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:52 PM

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

21-01-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కట్‌పల్లి పట్టణంలోని వెడ్డింగ్ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా జరగేలా చర్యలు తీసుకోవాలని నార్కట్‌పల్లి నూతన ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు పెరుగుతున్నాయని, వీటికి గట్టి అడ్డుకట్ట వేయాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, ప్యాట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేశారు.

నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి రక్షణ కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మందు, డబ్బు పంపిణీని పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎడ్ల మహాలింగం, రమేష్ చారి, సూరయ్య, మణిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News