Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:44 AM

“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం

“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం

“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?”  “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం
April 11, 2026 06:57 AM 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూడు దిక్కులా లీక్ అవుతున్న వాటర్ లైన్

పట్టించుకోని అధికారులు… కలుషిత నీటితో గ్రామస్తుల ఆవేదన

రామన్నపేట:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామంలోని నిర్నెముల వెళ్లే దారిలో ఉన్న ప్రధాన వాటర్ పైప్ పగిలి మూడు దిక్కులా నీరు లీక్ అవుతూ వృథాగా పారిపోతోంది.

నెలలు కాదు… సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. పగిలిన పైపుల ద్వారా బయటకు వస్తున్న నీరు మట్టిలో కలిసిపోతుండగా, అదే నీరు తిరిగి సరఫరా అవుతుండటంతో గ్రామస్తులు కలుషిత నీరు తాగాల్సిన పరిస్థితి నెలకొంది.

గ్రామానికి చెందిన వర్కాల నరేష్ మాట్లాడుతూ…

“పైపు పగిలి చాలా కాలమైంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా గ్రామ సభలో చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము తాగేది శుభ్రమైన నీరా, కలుషితమా అన్న అనుమానం ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

లీకేజీ కారణంగా రహదారిపై బురద పేరుకుపోయి, రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. దోమలు, దుర్వాసనతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధి పేరుతో ప్రభుత్వం తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ, నిధానపల్లిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పగిలిన వాటర్ పైపులను తక్షణమే మరమ్మతు చేసి, గ్రామస్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News