Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా హోమియోపతి వైద్య శాస్త్ర పితామహుడు డా సి ఎఫ్ శామ్యూల్ హానీమన్ జయంతి

Updated : 10 Apr 2026 20:19 IST
As Preferred Source 1 min read
ఘనంగా హోమియోపతి వైద్య శాస్త్ర పితామహుడు డా సి ఎఫ్ శామ్యూల్ హానీమన్ జయంతి

ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

హోమియోపతి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక" లో భాగంగా శుక్రవారం భువనగిరి జిల్లా ఆసుపత్రి వద్ద హోమియోపతి వైద్య శాస్త్ర పితామహుడు డాక్టర్ సి.ఎఫ్ శామ్యుల్ హానీమన్ 271వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం మెగా హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో యోగా ప్రాముఖ్యత ను వివరిస్తూ యోగా కార్యక్రమం నిర్వహించారు. వైద్య శిబిరం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా హోమియో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత మాట్లాడుతూ...డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మరియు హోమియోపతి ఆధ్వర్యంలో హోమియోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అవుట్ పేషెంట్లు,భువనగిరి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాల భారతి,డాక్టర్ సద్గుణ,డాక్టర్ కవిత,డాక్టర్ విజయలక్ష్మి,డాక్టర్ శ్రీనివాస్,డాక్టర్ రోజీమేరీ,భువనగిరి సామాజిక కార్యకర్తలు డాక్టర్ బర్రె ప్రమీల,సద్ది (వివేరా) వెంకట్ రెడ్డి,జంపాల అంజయ్య,మాటూరి బాలేశ్వర్,కొడారి వెంకటేష్,యోగా మాస్టర్,హోమియోపతి వైద్య సిబ్బంది,హోమియోపతి పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా హోమియోపతి వైద్య శాస్త్ర పితామహుడు డా సి ఎఫ్ శామ్యూల్ హానీమన్ జయంతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి