Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

9వ రోజుకు చేరిన సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటూ తిరువూరులో ఉధృత ఆందోళనలు

24-02-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం తొమ్మిదవ రోజుకు చేరుకోవడంతో తిరువూరులో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు కార్యాలయాల ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నారు. నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ప్రధానంగా జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకూ పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చట్టప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని వారు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత, వృద్ధాప్య భద్రతపై అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఉద్యోగులకు కనీసం రూ.5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని కోరారు. 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డివిడెండ్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. “సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుంది” అని ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమ్మె దీర్ఘకాలం కొనసాగితే సహకార రంగంపై ప్రభావం పడే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

9వ రోజుకు చేరిన సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలంటూ తిరువూరులో ఉధృత ఆందోళనలు

Article Image

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం తొమ్మిదవ రోజుకు చేరుకోవడంతో తిరువూరులో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు కార్యాలయాల ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నారు. నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ప్రధానంగా జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకూ పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చట్టప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని వారు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత, వృద్ధాప్య భద్రతపై అనిశ్చితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఉద్యోగులకు కనీసం రూ.5 లక్షలకు తగ్గకుండా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని కోరారు. 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డివిడెండ్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. “సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుంది” అని ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమ్మె దీర్ఘకాలం కొనసాగితే సహకార రంగంపై ప్రభావం పడే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News