Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:39 AM

42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం

13-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

నల్లగొండ, చిట్యాల:

గత 42 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించి ఎన్నో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గెజిటెడ్ ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఉద్యోగ విరమణ పొందారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సేవలందించిన ఆయన, తన సేవల కాలంలో మండల, జిల్లా స్థాయిలలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు.

మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా తన బోధనతో విద్యార్థుల్లో పటిష్టమైన పునాది వేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. నేరడ గ్రామంలో సుమారు రెండున్నర సంవత్సరాలు గణిత ఉపాధ్యాయుడిగా సేవలందించి అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దారు.

ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి మమత, కుమారుడు సాయి, బంధుమిత్రులు, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పాల్గొని అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, “గుత్తా రామ్మోహన్ చేసిన సేవలు మరువలేనివి. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా కొనసాగాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

Sthanikam

42 ఏళ్ల సేవలకు వీడ్కోలు – ఉపాధ్యాయుడు గుత్తా రామ్మోహన్ ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News