Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:47 PM

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ
21-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా సాధనకు సిపిఐ సంపూర్ణ మద్దతు

ఆదోని, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న బందులో ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు సిపిఐ సిద్ధంగా ఉందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బుధవారం స్థానిక భీమాస్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి యు.లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్ మాట్లాడుతూ, ఆదోని జిల్లా సాధన అనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని, ఈ ఉద్యమంలో సిపిఐ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. జిల్లా సాధన కోసం అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఆదోని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక జిల్లా అవసరం అనివార్యమని, ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజల భావోద్వేగాలను గుర్తించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 24న నిర్వహించనున్న బందును విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.బందును శాంతియుతంగా, కానీ దృఢంగా నిర్వహించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు కోరారు.

ఈ సమావేశంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కె.రమేష్ కుమార్, సిపిఐ న్యూగాంధీనగర్ శాఖ కార్యదర్శి ఏ.విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, సహాయ కార్యదర్శి కె.లింగప్ప, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్, మరాఠి శాఖ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

24న జరిగే బందును జయప్రదం చేయాలి – సిపిఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News