Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ పౌర్ణమి వేళ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:35 PM

17వ వార్డులో బీజేపీ అభ్యర్థి కుంచం మహేశ్వరి సురేష్ గారిని గెలిపించాలి

05-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు

17వ వార్డు బీజేపీ అభ్యర్థి కుంచం మహేశ్వరి సురేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. గురువారం 17వ వార్డులో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన స్థానిక మహిళా నాయకురాలైన కుంచం మహేశ్వరి సురేష్ కి బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వార్డు ప్రజలు ఆమెకు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతిమయంగా మారిందని విమర్శించారు.దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొంటూ, ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారని, కరోనా సమయంలో ప్రజలందరికీ మూడు సార్లు ఉచితంగా వ్యాక్సిన్లు అందించారని గుర్తు చేశారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వివరించారు.అదేవిధంగా గతంలో ఎన్‌డిఏ పాలనలో జుట్టుకొండ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో సూర్యాపేట పట్టణంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని సంకినేని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ , వార్డు ఇంచార్జ్ మధు , పార్టీ నాయకులు అయితగాని జనార్ధన్ , రేగటి రాజేష్ , బోనగిరి శ్రీకాంత్ , కుంచం లింగరాజు , పప్పురాజు , నవీన్ చారి , శివరాత్రి శ్రీకాంత్ , తుంగతుర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

17వ వార్డులో బీజేపీ అభ్యర్థి కుంచం మహేశ్వరి సురేష్ గారిని గెలిపించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News