Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

12వ వార్డు 'హస్తం' అభ్యర్థిగా పాక చిరంజీవి

30-01-2026 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దతు.. కార్యకర్తల్లో ఉత్సాహం

చౌటుప్పల్ మున్సిపాలిటీ

ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాక చిరంజీవి బరిలోకి దిగారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఆయన తన నామినేషన్ ను ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక ప్రోత్సాహం అందించిన చౌటుప్పల్ రామాలయ చైర్మన్ బొబ్బిళ్ల మురళి కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో పాటు పార్టీ శ్రేణుల ఐక్యతతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

12వ వార్డు 'హస్తం' అభ్యర్థిగా పాక చిరంజీవి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News