Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:23 AM

11వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా చిత్తలూరి జయమ్మ కృష్ణ

30-01-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట సిటీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 11వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున చిత్తలూరి జయమ్మ కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై పార్టీ శక్తిని ప్రదర్శించారు.

నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పార్టీ శ్రేణులు నినాదాలతో ఉత్సాహంగా పాల్గొనగా, బిఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. చిత్తలూరి జయమ్మ కృష్ణ మాట్లాడుతూ, తనను ఆశీర్వదించి గెలిపించినట్లయితే 11వ వార్డు ప్రజల సేవకురాలిగా ఉంటూ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీకి ప్రజల మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని, మహిళలు, పేదల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. 11వ వార్డు ప్రజలు తనకు మద్దతుగా నిలిచి ఘన విజయం అందించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

11వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా చిత్తలూరి జయమ్మ కృష్ణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News