Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:25 PM

10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?

18-01-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట–అమ్మనబోలు రోడ్డుపై వరుస ప్రమాదాలకు మలుపులే కారణమా?
సూచికలు లేవు.. వేగ నియంత్రణ లేదు
10 కిలోమీటర్ల రహదారిలో 15 మలుపులు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట నుంచి అమ్మనబోలు వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారాయి. రహదారి అనేక ప్రాంతాల్లో ఒకే వైపు వాలిగా ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయినా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానంగా రామన్నపేట నుంచి మునిపంపుల వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే 15కు పైగా ప్రమాదకర మలుపులు ఉండటం రహదారి దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మలుపుల వద్ద పెరిగిపోయిన ముళ్లపొదలు, చెట్లు ఎదురుదెరుగా వచ్చే వాహనాలు కనిపించకుండా చేస్తున్నాయి. దీంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాహనదారులు చెబుతున్నారు.అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ప్రమాద సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఎక్కడా కనిపించడం లేదు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మలుపుల వద్ద చెట్ల తొలగింపు, సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Sthanikam

10 కిలోమీటర్ల దూరంలోనే 15 ప్రమాదకర మలుపులు.. ఎవరిది బాధ్యత?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News