Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

వంట గ్యాస్‌కు గండం.. సిలిండర్ బుకింగ్‌పై కొత్త ఆంక్షలు..!

06-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం భారతీయ వంటింటిపై పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల పెరిగిన అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాపై ప్రభావం పడడంతో దేశంలో వంటగ్యాస్‌ (ఎల్‌పిజి) సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల నాలుగు రోజులుగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పెద్ద ఎత్తున బుకింగ్‌లు చేయడం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ముందుగానే రీఫిల్ సిలిండర్లను బుక్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాన ఆయిల్ కంపెనీల డీలర్లు అనధికారికంగా సిలిండర్ బుకింగ్‌పై కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు చివరి సిలిండర్ తీసుకున్న తేదీ నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునేలా, సింగిల్ సిలిండర్ ఉన్నవారు 21 రోజుల తర్వాత మాత్రమే తిరిగి బుకింగ్ చేసుకునేలా పరిమితులు విధిస్తున్నారు.

అయిల్ కంపెనీల నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోయినా, పెరుగుతున్న బుకింగ్ ఒత్తిడిని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డీలర్లు చెబుతున్నారు. వినియోగదారులు ఉపయోగించే పోర్టల్స్‌, యాప్‌లలో కూడా గడువు పూర్తయిన తర్వాతే బుకింగ్ చేసుకునే విధంగా సాఫ్ట్‌వేర్ మార్పులు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం దేశంలో ముడి చమురు నిల్వలు దాదాపు 8 వారాలకు సరిపడేలా ఉన్నప్పటికీ, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు కొనసాగితే వంటగ్యాస్‌తో పాటు పెట్రోల్‌, డీజిల్ సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో వంటగ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. అధికారులు మాత్రం అవసరమైన సరఫరా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Sthanikam

వంట గ్యాస్‌కు గండం.. సిలిండర్ బుకింగ్‌పై కొత్త ఆంక్షలు..!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News